సొరంగ మార్గం గుండా వెళ్తున్న రైలు పట్టాలు తప్పి సొరంగా మార్గాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రైలులో ఉన్న 36 మంది ప్రాణాలు వదిలారు.. ఈ విషాదకర ప్రమాదం తైవాన్లో చోటు చేసుకుంది…శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టింది. ఇంకా అక్కడ మీడియాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 80 మంది గాయపడ్డారు.
రెస్క్యూ టీమ్ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇంకా కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. అయితే అక్కడ లోపల చీకటిగా ఉండటంతో వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు..ఈ రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో దాదాపు రైలులో 300 మంది ఉంటారు అని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇలా రైలు ప్రమాదం జరిగిన వెంటనే రైలులో ప్రయాణికులు రోధనలు చేశారు, వెంటనే స్టానికులు పోలీసులకు రైల్వే అధికారులకి సమాచారం ఇచ్చారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో కొందరి పరిస్దితి సీరియస్ గా ఉందని సమాచారం అందుతోంది.