అత్యంత దారుణమైన పని అంటే గనిలోనే అని చెప్పాలి, నిత్యం ప్రమాదాలతో అక్కడ కార్మికులు పనులు చేస్తారు, అయితే తాజాగా ఓ పెను ప్రమాదం జరిగింది, ఈ విషాదం అందరిని కంట తడిపెట్టిస్తోంది…మయన్మార్‌లో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 96 మందికి పైగా మృతిచెందారు.
నార్తర్న్ మయన్మార్‌లో ఉన్న జేడ్ గనిలో ఈ ప్రమాదం జరిగింది. మట్టిచరియల కింద కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ చాలా మంది కింద పని చేస్తున్న సమయంలో గని దగ్గర మట్టి చరియలు విరిగిపడ్డాయి, పెద్ద పెద్ద కొండ చరియలు కారణంతో చాలా మంది మరణించి ఉంటారు అని తెలుస్తోంది.
ఆ దేశ అగ్నిమాపక శాఖ సహాయక చర్యల్లో నిమగ్నమైంది. కాచిన్ రాష్ట్రంలో ఉన్న గనిలో రాళ్లు సేకరిస్తున్న సమయంలో భారీ వర్షం వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 96 మృతదేహాలను వెలికితీసారు. గతంలో 2015లో ఇక్కడే జరిగిన ఘటనలో 116 మంది మరణించారు. ఇంకా మృతులు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు అధికారులు.