ఎంతో సరదాగా సందడిగా పార్టీలు అవి చేసుకుంటారు రెస్టారెంట్లలో… కాని అనూహ్యాంగా ఏదైనా ప్రమాదం అక్కడ సంభవిస్తే ఎంతో నష్టం వాటిల్లుతుంది, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతారు.. అక్కడకు వచ్చిన అతిధులు కస్టమర్లు, తాజాగా ఇలాంటి ప్రమాదమే జరిగింది.
చైనా ఉత్తర ప్రావిన్సులు షాంగ్జీలో రెస్టారెంట్ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు, అంతేకాదు మరో 32 మంది గాయపడ్డారు, అందులో కొందరి పరిస్ధితి సీరియస్ గా ఉంది, 9 మందికి సీరియస్ గా ఉండటంతో మరో ఆస్పత్రికి వారిని తరలించారు.
ఈ రెస్టారెంట్ ఒక్కసారిగా కూలిపోవడంతో వెంటనే సహాయక సిబ్బంది వందలాది మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మూడు గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న 57 మందిని బయటకు తీశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.. భద్రతా నియమాలను పాటించకపోవడంతో ఈ భవనం కూలింది అని ప్రాధమికంగా భావిస్తున్నట్లు అక్కడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.