సెల్ ఫోన్ వర్షంలో తడిసిందా – నీటిలో జారిందా – ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి

Follow this technique if your cell phone falls into the water

0
92

ఈ రోజుల్లో మన చేతిలో మొబైల్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటోంది. మనకు జీవితంలో మొబైల్ భాగం అయిపోయింది. అయితే మొబైల్ ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కాస్త చేజారినా వేల రూపాయలు పోయినట్లే. అయితే ఇప్పుడు రెయినీ సీజన్ వచ్చేసింది. మరి మొబైల్ నీటిలో పడినా తడిచినా ఏం చేయాలి అనేది నిపుణులు చెబుతున్నారు చూద్దాం.సెల్ ఫోన్ నీటిలో పడిందా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి

ఒక్కోసారి మొబైల్ చేతిలోంచీ జారి నీటిలో పడుతుంది వెంటనే మీరు ఫోన్ ఆన్ చేయకండి. వెంటనే ఆ ఫోన్ స్విఛ్చాప్ చేయండి. అసలు దానిని అటూ ఇటూ తిప్పవద్దు, ఇక చాలా మంది స్టవ్ పై పెడతారు. ఇలా వేడి చేస్తారు. ఇది చాలా ప్రమాదం సెల్ ఫోన్ కూడా పేలిపోతుంది. ఇలా స్టవ్ పై పెట్టకండి
ఎండలో కూడా పెట్టవద్దు.

ముందు దాని బ్యాక్ కవర్ తీసేయండి. మొత్తం ఫోన్ ని పొడిగుడ్డ తీసుకుని తుడిచేయండి, సిమ్ బ్యాటరీ మెమెరీ కార్డు అన్నీ తీసేయండి.ఇప్పుడు ఓ కవర్లో బియ్యం తీసుకొని, అందులో ఫోన్, బ్యాటరీ ఉంచి పూర్తిగా బియ్యంతో కప్పేసి గాలి చేరకుండా కవర్ని క్లోజ్ చెయ్యాలి. ఇలా చేస్తే బియ్యం ఆ వాటర్ ని పీల్చేస్తుంది. ఇలా 24 గంటలు ఉంచండి. తర్వాత రోజు సిమ్ బ్యాటరీ మెమెరీ కార్డు వేసుకుని వాడండి. ఈజీగా పనిచేస్తుంది. అయినా ఆన్ కాకపోతే, ఇక సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లక తప్పదు.