రైల్వే ప్రయాణికులకు షాక్ – ట్రైన్స్లో ఇక ఫుడ్ ఉండదా ?

రైల్వే ప్రయాణికులకు షాక్ - ట్రైన్స్లో ఇక ఫుడ్ ఉండదా ?

0
91

నిజమే ఈ వార్త ఇప్పుడు బాగా వినిపిస్తోంది, అసలు రైల్లో ఫుడ్ ఉండకపోవడం ఏమిటి అని అనుకుంటున్నారా, సో అదేమిటో చూద్దాం.రైళ్లలో జర్నీ చేసే వారికి ఆహారం, టీ, కాఫీ వంటివి బంద్ అవుతాయి అంటున్నారు కొందరు.

ఇండియన్ రైల్వేస్ ప్యాంట్రీ సర్వీసులను ఆపేస్తుంది అంటున్నారు, రైల్వేస్కు చెందిన ఒక పెద్ద యూనియన్ ఈ అంశంపై రైల్వే మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. ప్యాంట్రీ కార్లను తొలగించాలని ఇందులో డిమాండ్ చేసింది. వీటి స్థానంలో మరిన్ని ప్యాసింజర్ కోచ్లను ఏర్పాటు చేయొచ్చని సూచించింది.

అయితే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం రైల్వే తీసుకుంటుందా అనే అనుమానం కూడా అందరికి కలుగుతోంది, వీటిని రైళ్లలో తొలగించడం వల్ల రైల్వే ఆదాయం పెరుగుతుందని వారి సలహా,
ప్రయాణికులకు ఆహారాన్ని బేస్ కిచెన్ నుంచి కూడా సరఫరా చేయొచ్చని తెలియజేసింది.
అంతేకాదు ఈ ప్యాంట్రీ కార్ వల్ల ఆదాయం ఏమీ లేదు అని తెలిపారు. సో మరి దీనిపై నిర్ణయం తీసుకుంటారా లేదా వీటిని కొనసాగిస్తారా అనేది చూడాలి. కొందరు సీనియర్ అధికారులు మాత్రం రైల్వే ఈనిర్ణయం తీసుకోదు అంటున్నారు.