ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతోంది, పసిమెగ్గలోనే ప్రాణాలను చితిమేస్తున్నారు, మరో దారుణమైన ఘటన జరిగింది తమిళనాడులోని. నాలుగు రోజుల పసికందును పసరు పోసి చంపేసిన అమానుష ఘటన వెలుగుచూసింది.
మదురై జిల్లా షోలవందన్ పంచాయతీకి చెందిన తవమణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు సంతానం. ఇటీవల అతని భార్య నాలుగోబిడ్డకు జన్మనిచ్చింది. అయితే నాలుగో కాన్పులో కూడా అమ్మాయి పుట్టడంతో వారికి నచ్చలేదు, దీంతో తవమణి, అతని తల్లి పాండియమ్మాల్ ఆ నాలుగు రోజుల పసిపాపకు ఆకు పసరు పోశారు, చివరకు ఊపిరాడకుండా చేసి చంపారు, ఊరికి సమీపంలోని నదిలో పూడ్చిపెట్టేశారు.
ఇక పాప కనిపించకపోవడంతో తల్లి స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు, అయితే బిడ్డ ఆరోగ్యం బాగాలేక చనిపోయింది పూడ్చి పెట్టాం అన్నారు, దీంతో పోలీసులు ఆ పాపని పూడ్చిన చోట శవం బయటకు తీశారు. పోస్ట్ మార్టం చేస్తే ఆమె తలపై గాయాలు ఉన్నాయి ..పసరు పోసి చంపారు అనేది తేలింది, దీంతో వారిద్దరికి అరెస్ట్ చేశారు పోలీసులు.