గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్నరాతి గడపకు ఎందుకు నమస్కరిస్తారు

గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్నరాతి గడపకు ఎందుకు నమస్కరిస్తారు

0
114

మనం గుడికి వెళ్లిన సమయంలో కచ్చితంగా ఆలయంలోకి వెళ్లే ముందు ప్రధాన ద్వారం దగ్గర
గడపకు నమస్కరిస్తాము. అయితే ఇలా పెద్దలు పాటించారు కాబట్టి మనం కూడా పాటిస్తున్నాము అని అంటాం, అంతేకాదు ముందు మొట్టు కాబట్టి అలా మొక్కివెళతాం అని అంటారు.

అయితే ఇలా చేయడానికి గల కారణాలు చాలా మందికి తెలియదు..వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది.

రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆ దేవుడు రాతిమీద వెలిశాడు కాబట్టి కచ్చితంగా మనం గుడికి వెళ్లేముందు ఆ రాయిని తాకి నమస్కరిస్తాం, ఇక గుడిలో ఉన్న గడప అందరి కంటే ముందు స్వామిని దర్శించుకుంటుంది, అందుకే అది ఎంతో పుణ్యం చేసుకుంది కాబట్టి దానికి నమస్కరిస్తాం, అందుకే దానిని తొక్కకుండా ముందుకు అడుగు వేస్తాం.