గోదారోళ్లా మజాకా ఓసారి వీరు పంపిన సారె చూడండి

Godavari district etiquette, Affection, love, spirituality

0
131

ఉభ‌య గోదావరి జిల్లా ప్రజల మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మర్యాదలు ముందు ఆ తర్వాత మేము అంటారు. ఆప్యాయత, ప్రేమ, ఆత్మీయ పలకరింపు అన్నీ వారిలో కనిపిస్తాయి. ఇక ఎవరైనా అతిధులు ఇంటికి వచ్చారంటే పొట్ట ఫుల్ అవ్వాల్సిందే. అన్ని రకాల వంటకాలతో విందు పెడతారు. ఇక వెజ్- నాన్ వెజ్ వంట‌కాల‌ విషయంలో గోదారోళ్ల‌ స్టైల్ వేరు అనేక రకాల వంటకాలు వండుతారు.

ఇక పెళ్లిళ్లు అయితే అక్కడ ఉండే సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఓ కుటుంబం వారి కుమార్తెకు సారె పంపింది. ఇప్పుడు ఈ సారె వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారి బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి, యానాంకు చెందిన వ్యాపారవేత్త తోటరాజు కుమారుడు పవన్ కుమార్ కు ఈ ఏడాది జూన్ లో ఘనంగా వివాహం జరిగింది.

ఇక ఆషాడ మాసం రావడంతో బలరామకృష్ణ కుమార్తెకు సారె పంపారు. ఆ సారె కూడా మాములుగా కాదు ఊరేకాదు, ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సారె గురించి మాట్లాడుకుంటున్నారు. లారీల్లో సారె తీసుకుని కుమార్తె ఇంటికి వెళ్లారు. స్వీట్లు, చేపలు, కిరాణాసామాన్లు, ఇంటిలోకి సామాన్లు, మేకపోతులు, కొరమేనులు, రొయ్యలు, నాటుకోళ్లు, తినుబండారాలు, ఆవకాయ, కూరగాయలు ఇలా అన్నీ కలిపి యానాం వరకూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఇది చూసి జ‌నాలు గోదారోళ్లా మజాకా అంటున్నారు.