గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు..మార్కెట్లో నేటి ధరలు ఇలా?

0
88

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా ఉంది. దాంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కానీ అలా నిరాశ చెందేవారికి నేడు బంగారం అధికంగా తగ్గి చక్కని శుభవార్త చెప్పింది.

హైద‌రాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 580 తగ్గి రూ. 52,860 గా ఉంది. ఇంకా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 48,450 గా ప‌లుకుతుంది. ఒక్కసారే ధరలు తగ్గుముఖం పడడం మహిళకు ఆనందం పడే విషయమేనని చెప్పుకోవచ్చు.

ప్రస్తుతం వెండి ధరలు విషయానికి వస్తే  కేజీ వెండి ధర యధావిధిగా ఉంది రూ. 70,500 గా ఉంది. పసిడి ప్రియులు వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే బంగారం షాపులలో  గిరాకీ మాములుగా ఉండదు.