అమెజాన్ యాప్ పై మరో గుడ్ న్యూస్

అమెజాన్ యాప్ పై మరో గుడ్ న్యూస్

0
99
Amazon

అమెజాన్ ఈకామర్స్ వెబ్ సైట్లలో ప్రపంచంలోనే అతి పెద్దది, పుస్తకాల నుంచి హొమ్ నీడ్స్ వరకూ అనేక రకాల వస్తువులు ఆన్ లైన్ లో అమ్ముతోంది ఈ కంపెనీ, అనేక మంది లక్షలాది రిటైలర్లని హోల్ సెల్స్ ని కనెక్ట్ చేసింది, అయితే అమెజాన్ ఇండియా తన వెబ్సైట్, యాప్ను వివిధ భారతీయ భాషల్లో అందిస్తోంది.

ఇక ప్రాంతీయంగా కస్టమర్లకు అందుబాటులో తీసుకువచ్చేలా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తమ ఉత్పత్తుల గురించి తెలియజేస్తున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది దీంతో కొత్తగా 20 కోట్ల నుండి 30 కోట్ల మంది వినియోగదారులకు సులభంగా ఆన్లైన్ షాపింగ్ చేసే అవకాశం కల్పిస్తోంది.

షాపింగ్ లో సరికొత్త ఎక్సపీరియన్స్ రానుంది కస్టమర్లకు. ఇలా చేయడం వల్ల భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకే కస్టమర్లు తమకు అనువైన భాషలో డీల్స్, డిస్కౌంట్స్ తెలుసుకోవడం, ఉత్పత్తుల సమాచారం చదువుకోవడం, ఖాతాల నిర్వహణ, ఆర్డర్స్, చెల్లింపులు జరిపేందుకు మార్గం ఇక ఈజీగా అవ్వనుంది… కస్టమర్ సర్వీస్ సిబ్బందితో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో మాట్లాడవచ్చు. మీకు నచ్చిన భాషని ఇక సెలక్ట్ చేసుకోవచ్చు.