నిరుద్యోగులకు శుభవార్త. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో 38,926 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఇక పలు పోస్టల్ సర్కిళ్లల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి.
చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 16 ఖాళీలు ఉండగా..ఈ ఉద్యోగాలకు అప్లై చాయడానికి 2022 ఆగస్ట్ 12 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు పామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.
విద్యార్హతలు:
10వ తరగతి పాస్ కావాలి.
హెవీ మోటార్ వెహికిల్, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ తప్పనిసరి.
డ్రైవింగ్‌లో మూడేళ్ల అనుభవం ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి.
వయస్సు- 56 ఏళ్ల లోపు
ఎంపిక విధానం- రాతపరీక్ష లేదా స్కిల్ టెస్ట్
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్- O/o the Senior Manager (JAG), Mail Motor Service, No 37, Greams Road, Chennai 600 006