శుభవార్త..గ్రూప్‌-1 నోటిఫికేషన్ కు సర్వం సిద్ధం..

0
113

తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పడెప్పుడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగ భర్తీకి టీఎస్‌పీఎస్సీ శ్రీకారం చుట్టబోతున్నారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో 83,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అందులో గ్రూప్‌-1 మొత్తం 503 పోస్టులు భర్తీ కానున్నవిషయం అందరికి తెలిసిందే. తాజాగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది.

మొత్తం 12 శాఖల నుండి 19 రకాల పోస్టులకు ప్రతిపాదనలు టీఎస్‌పీఎస్సీ అందాయి. అయితే వీటిలో నాలుగైదు విభాగాల ప్రతిపాదనల తయారీలో సాంకేతిక పొరపాట్లు ఎదురుకావడంతో… వీటిని సవరించి ఎలాంటి న్యామపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కమిషన్ కు సూచిస్తోంది. ఈ సవరణల అనంతరం సమాచారం అందిన వెంటనే కమిషన్ గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటన జారీ చేసే ఆలోచనలో ఉన్నారు.