అయ్యప్ప స్వాములకు గుడ్‎న్యూస్..ఇలా చేస్తే ఆరుగురికి ఉచిత ప్రయాణం..!

Good news for Ayyappa Swamis..if you do so, free travel for six ..!

0
107

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‎న్యూస్ చెప్పింది. శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు నడుతున్నట్లు వెల్లడించింది. ఈ 200 ప్రత్యేక బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ చెప్పారు. అలాగే బస్సును ముందుగానే బుక్ చేసుకుంటే గురుస్వామితో పాటు మరో ఆరుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందన్నారు.

కేరళ అధికారులతో సంప్రదింపులు జరిపి పంబా వద్ద స్పాట్‌ బుకింగ్‌ ద్వారా బస్సులోని భక్తులందరూ ఒకే సమయంలో దర్శనం చేసుకునే సదుపాయాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బస్సును ముందుగానే అద్దె ప్రాతిపదికన బుక్‌ చేసుకుంటే గురుస్వామితో పాటు ఇద్దరు వంటవాళ్లు, ఇద్దరు మణికంఠలు, ఒక అటెండర్ మొత్తం ఆరుగురు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సజ్జనార్‌ చెప్పారు.

బుకింగ్‌ రద్దు ఛార్జీలను కూడా సవరిస్తున్నట్లు సజ్జనార్ చెప్పారు. శబరిమలకు వెళ్లేందుకు బస్సును 48 గంటల కన్నా ముందుగా రద్దు చేసుకుంటే మునుపటి మాదిరిగానే రూ.1000 వసూలు చేస్తారు. 24 గంటల నుంచి 48 గంటల లోపు రద్దు చేసుకుంటే గతంలో అద్దె మొత్తంలో పది శాతాన్ని మినహాయించేవారు. పూర్తి వివరాలకు 040-30102829లో లేదా సమీప డిపో మేనేజర్‌ను సంప్రదించాలని సజ్జనార్‌ వెల్లడించారు.