బీఈ/బీటెక్ చేసిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్/పవర్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు కనీసం 65 శాతం మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)/ఇంటిగ్రేడెట్ డ్యూయల్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గేట్ 2023లో వ్యాలిడ్ స్కోర్ ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు జులై 31, 2022 నాటికి తప్పనిసరిగా 28 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2023 ఫలితలు విడుదలైన తర్వాత వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేస్తారు.