తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి భక్తులకు శుభవార్త. వెంకన్న దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు.
తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
అలాగే తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం, ఇతర సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, ఎస్వీబీసీ రేడియో, ఎస్వీ ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రసారం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆకాశవాణి ద్వారా ఈ ప్రసారాలను నిలుపుదల చేయించినట్టు టీడీడీ ఒక ప్రకటనలో తెలిపింది. టీటీడీకి సొంత ఛానల్, ఎఫ్ఎం ఉండడమే దీనికి కారణం.