ఉద్యోగులకు శుభవార్త.. అదనంగా రూ.30 వేలు పొందొచ్చు!

0
102

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త. జీతంతో పాటుగా ఇతర లాభాలను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందొచ్చు. అయితే ప్రతీ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతం పెంచుతూ వుంటారు. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు రూపంలో ఈ పెరుగుదల ఉంటుంది. అయితే ఈ ఒక్క లాభమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందొచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..ఉన్నత డిగ్రీ పొందిన వారికి ప్రోత్సాహకాన్ని 5 రెట్లు పెంచేసింది. దీనితో వారికి రిలీఫ్ గా ఉంటుంది. అదే విధంగా పీహెచ్‌డీ వంటి ఉన్నత డిగ్రీలు పొందిన ఉద్యోగులకు ప్రోత్సాహక మొత్తాన్ని రూ.10,000 నుంచి రూ.30,000కు పెంచారు. దీనితో వారికి ఊరట కలగనుంది. అలానే ఉన్నత డిగ్రీలు చదివే ఉద్యోగులకు ప్రోత్సాహక మొత్తాన్ని పెంచేందుకు కేంద్రం 20 ఏళ్ల నిబంధనలను సవరించింది.

సవరణ తర్వాత ఈ ప్రోత్సాహక కనీస మొత్తాన్ని రూ.2000 నుండి రూ.10,000కి పెంచారు. కనుక ఉన్నత డిగ్రీని సాధించినప్పుడు ఎక్కువ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందొచ్చు. 3 సంవత్సరాలు లేదా అంత కన్నా తక్కువ కాలంలో డిప్లొమా కోర్సులు చేస్తే రూ. 10,000, 3 సంవత్సరాల కన్నా ఎక్కువ కాల పరిమితిలోని డిగ్రీ లేదా డిప్లొమా చేస్తే రూ. 15000 ప్రోత్సాహకంగా వస్తుంది.పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా చేయడానికి 1 సంవత్సరం లేదా అంత కన్నా తక్కువ రూ. 20,000 చెల్లిస్తారు.

అదే విధంగా గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా తీసుకున్న ఉద్యోగులకు రూ. 25,000 చెల్లిస్తారు. ఒకవేళ పీహెచ్‌డీ విద్యార్హత పూర్తి చేస్తే అప్పుడు రూ. 30,000 ప్రోత్సాహకం ఇస్తారు. ఉద్యోగి పొందిన డిగ్రీ/ డిప్లొమా ఉద్యోగి పోస్ట్‌కి సంబంధించి ఉండాలి లేదా ఈ డిగ్రీ అతని తదుపరి పోస్ట్‌లో చేస్తున్న పనికి సంబంధించి తప్పక ఉండాలి. అకడమిక్ విద్యకు లేదా సాహిత్య విషయాలలో ఉన్నత విద్యార్హతలను పొందితే మాత్రం ఉండదు.