తెలంగాణ రైతులకు శుభవార్త..త్వరలో ఖాతాల్లో ఆ డబ్బు జమ

0
104

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. ఈ పథకాల మీద ఆధారపడి బతికే రైతులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో రైతు బంధు ఒకటన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ పథకం కింద రైతులకు ప్రతీ ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ కొంతమేరకు ఆదుకుంటుంది. అయితే ఈ రైతుబంధు తీసుకునే రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎకారానికి వానాకాలం రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇచ్చేందుకు  నిధుల పంపిణీ అంశంపై అధికారులు దృష్టి పెట్టి రైతులకు వీలయినంత త్వరగా ఖాతాల్లో డబ్బులు జమచేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు.

జూన్‌ మొదటి వారం నుంచే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించారని సమాచారం తెలుస్తుంది. ఇందులో భాగంగానే జూన్‌ మొదటి వారం నుంచి..ఆ నెల చివరి వరకు వానా కాలం సాగుకు రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లు తెలుస్తోంది.  గత వానాకాలం సీజన్ లో వాడిన పద్ధతినే అమలు చేయనున్నట్టు తెలిపారు.