రైతులకు గుడ్ న్యూస్..నేడు ఖాతాల్లో ఆ డబ్బులు జమ

0
78

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. ఈ పథకాల మీద ఆధారపడి బతికే రైతులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.6 వేలచొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ కొంతమేరకు ఆదుకుంటుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2018లో ప్రారంభించి రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే ఈ రైతుబంధు తీసుకునే రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు 11వ విడత కింద రైతుల ఖాతాల్లో నేడు డబ్బులు జమ చేసారు. ఈ డబ్బులు జమ అయ్యాయో లేదో PMKISA.GOV.IN వెబ్ సైట్ లో చూసుకోవాల్సి ఉంటుంది. డబ్బులు చూసుకునే క్రమంలో ఆధార్, బ్యాంకు ఖాతా నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది.