వాహనదారులకు గుడ్ న్యూస్..ట్రాఫిక్ చలాన్లపై కొత్త ఆఫర్

0
120

ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసే పనిలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి అద్భుతమైన కొత్త ఆఫర్ ను ప్రకటించారు పోలీసులు. ట్రాఫిక్ చలాన్ విధించిన నెల రోజులలోపు క్లియర్ చేసుకుంటే వాహనదారులకు 20 శాతం రాయితీ ఇచ్చే ఆలోచనలో కసరత్తు చేస్తునట్టు తెలిపారు.

అయితే ఈ కొత్త స్కీమ్ వల్ల వాహనదారులు త్వరగా జరిమానా చెల్లిస్తే మరోసారి చలాన్ పడకుండా జాగ్రత్తగా ఉంటారనే యోచనతో ఈ ఆఫర్ అమలు చేస్తునట్టు తెలిపారు. అంతేకాకుండా ట్రాఫిక్ నిబంధనపై కూడా అవగాహనా తెప్పించాలని లక్ష్యంతో ఈ స్కీమ్ కు శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలిపారు. వాహనదారుల్లో మార్పు తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తెలిపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.