ప్రయాణికులకు శుభవార్త..మహాశివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు

0
94

మహాశివరాత్రి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు రేప‌టి నుంచి మార్చి 4వ తేదీ వ‌ర‌కు ఉంటాయ‌ని టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్ల‌డించారు. ముఖ్యంగా మ‌హా శివ‌రాత్రి రోజు అత్యంత ర‌ద్దీ ఉండే కీస‌ర గుట్ట‌, ఏడుపాయ‌ల‌, బీరంగూడ‌ల‌కు ఎక్కువ సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సులు న‌డుపుతున్నట్టు అధికారులు వెల్ల‌డించారు.

ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు, తార్నాక, రెజిమెంటల్ బజార్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఘట్కేసర్, వెంకటాపురం, అల్వాల్, అమ్ముగూడ, బాలానగర్ క్రాస్ రోడ్డు, మియాపూర్ క్రాస్ రోడ్, పటాన్ చెరువులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామన్నారు. 30 మందితో కూడిన భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే తమ నివాసానికి సమీప ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు.

కొన్ని రోజుల క్రితం ముగిసిన సమ్మక్క- సారక్క జాతరకు సైతం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఎండీ సజ్జనార్ నేతృత్వంలో 60 మంది అధికారుల బృందం మేడారం సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్టాండ్ వద్దే బస చేసి ఆర్టీసీ సేవలను పర్యవేక్షించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 4 వేల బస్సులను ఆర్టీసీ నడిపించింది. ఇందుకోసం 12,500 మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు.