బ్రేకింగ్ – పబ్ జీ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇక డోంట్ వర్రీ

బ్రేకింగ్ - పబ్ జీ లవర్స్ కి గుడ్ న్యూస్ ఇక డోంట్ వర్రీ

0
86

పబ్ జీ ఈ గేమ్ ఎంత పాపులర్ గేమో తెలిసిందే ..మిలియన్ల మంది మన దేశంలో దీనిని ఆడుతున్నారు, ఇప్పుడు యువత సెల్ లో ఈ గేమ్ కచ్చితంగా ఉంటుంది, అయితే తాజాగా మన దేశంలో ఈ పబ్ జీ గేమ్ బ్యాన్ అయింది, దీంతో పబ్ జీ లవర్స్ తెగ టెన్షన్ లో ఉన్నారు,ఎప్పుడు ఈ గేమ్ వస్తుందా అని చూస్తున్నారు.

మరికొందరు ఆశలు వదులుకున్నారు, ఈ సమయంలో పబ్జీ గేమ్పై నిషేధం విధించిన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మల్టీ ప్లేయర్ గేమ్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.ఇది కూడా సేమ్ అలాగే ఉండనుందట.

ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అక్షయ్ తెలిపారు, దీనికి పేరు పెట్టారు ఫౌజ్, అంటే ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అని మీనింగ్ వస్తుంది, వచ్చే కొద్ది వారాల్లో ఈ గేమ్ లాంచ్ అవుతుంది

కేవలం వినోదమే కాదు.. మన సైనికుల త్యాగాలను తెలియజేయబోతున్నాం. ఈ గేమ్ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం భారత్కా వీర్ ట్రస్ట్కు అందజేయనున్నాం అని మనసున్న మారాజు మన హీరో అక్షయ్ తెలిపారు, దీంతో చాలా మంది పబ్జీ ప్లేయర్స్ ఆనందంలో ఉన్నారు, దీనికి సంబంధించి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు, ఇక ఇది మన దేశంలో తయారు అవుతోంది..
బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ రూపొందించింది దీనిని.. అక్షయ్ దీనికి మెంటార్గా వ్యవహరిస్తున్నారు.