శ్రీవారి భక్తులకు శుభవార్త..ఆర్జితసేవా టికెట్లు విడుదల

0
103

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను.. తితిదే విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లు, సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన టికెట్లు లక్కీడిప్‌లో కేటాయించింది. నేటి నుంచి ఈ నెల 29 వరకు టికెట్ల నమోదుకు అవకాశమిచ్చారు. లక్కీడిప్‌ టికెట్ల జాబితాను తితిదే వెబ్‌సైట్‌లో ఉంచనుంది.

జూన్ 29న మద్యాహ్నం 12 తర్వాత వెబ్‌సైట్‌లో లక్కీడిప్‌ టికెట్లను విడుదల చేయనున్నారు. పలు సేవా టికెట్లు బుధవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్న తితిదే.. కల్యాణోత్సవం, ఊంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేయనున్నారు.