శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపే ఆర్జితసేవా టికెట్లు విడుదల

0
107

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో దర్శించుకుంటున్నారు. తాజాగా శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి గుడ్ న్యూస్ చెప్పింది.

రేపు ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టిటిడి . ఇందులో భాగంగానే…46, 470 సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టిక్కేట్లను లక్కిడిఫ్ విధానంలో కేటాయించనుంది టిటిడి.

నిన్న 94,411 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 46,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా…హుండీ ఆదాయం రూ.3.41 కోట్లుగా నమోదు అయింది. ఇవాళ శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.