శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శన టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం

0
89

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారిని దర్శించుకునే వారికి ఇబ్బందులు లేకుండా దర్శనం టికెట్లు పెంచుతున్నట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 16 నుంకచి తిరుపతిలో సర్వ దర్శనం టికెట్లు జారీ చేస్తామని.. కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకు 10,000 టికెట్లు ఇస్తామని అంది. ఆన్ లైన్ లోనూ టికెట్ల జారీ కొనసాగుతుందని పేర్కొంది. ఇక టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ. కోటి విరాళమిచ్చిన వారికి ఈనెల 16న ఉదయాస్తమాన టికెట్లు కేటాయిస్తామని చెప్పింది. కరోనా వ్యాప్తి తగ్గడంతోనే ప్రస్తుతం దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించింది.