తెలంగాణ రాష్ట్ర ప్రభత్వం వేసవి సెలవులపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో విద్యారులు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుందని ఏప్రిల్ 24 వ తేదీ అంటే ఇవాల్టి నుంచి జూన్ 12వ తేదీ వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది. మళ్ళి నూతన విద్య సంవత్సరం జూన్ 13 ప్రారంభం కానుంది.
ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో వారికీ మాత్రమే వేసవి సెలవులు ప్రకటించారు. కానీ టెన్త్ పరీక్షలు ముగిసేవరకూ పాఠశాలకు రోజుకు ఒక ఉపాధ్యాయుడు వెళ్ళి విద్యార్థులకు శిక్షణ కల్పించాలి. అంతేకాకుండా నేటి నుండి ప్రైవేట్ పాఠశాలలను కూడా తెరవకూడదని విద్యాశాఖ హెచ్చరిస్తుంది.
మే 23 వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మే 6 తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. అనంతరం ఇంటర్ సెకండియర్ పరీక్షలు మే 7 తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ తేదీలు అనుసరించి విద్యార్థులు చదువుకుంటే మంచి ఫలితాలు రాబడతారు.