TET క్వాలిఫై కాని అభ్యర్థులకు గుడ్ న్యూస్..త్వరలో CTET నోటిఫికేషన్

0
87

CTET కోసం దేశ వ్యాప్తంగా D.EL.ED, B.ED అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ జులై మొదటి వారంలోగా వెలువడుతుందని భావించారు. కానీ CTET నోటిఫికేషన్ ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డిసెంబర్ 2022లో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ CBT విధానంలో నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. CTETడిసెంబర్ 2022 వివరణాత్మక నోటిఫికేషన్ ను త్వరలోctet.nic.inలో విడుదల చేస్తామని పేర్కొంది. ఇది 20 భాషల్లో నిర్వహించబడుతుందని నోటిఫికేషన్లో పేర్కొంది. CTET పరీక్ష విధానం, భాష, సిలబస్, అర్హత, పరీక్ష నగరం మరియు ముఖ్యమైన తేదీల వివరాలు త్వరలో విడుదల కాబోయే నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరుగుతుందని తెలిపింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ CTET పరీక్షకు సంబంధించి కచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. అయినా పరీక్షను డిసెంబర్ 2022లో నిర్వహిస్తామని స్పష్టం చేసింది. వాస్తవానికి పరీక్షకు 3 నెలల ముందు నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలైలో ప్రారంభమైతే నవంబర్ లో పరీక్ష నిర్వహించాలి. కానీ వాళ్లు విడుదల చేసిన నోటీస్ డిసెంబర్‌లో పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో CTET నోటిఫికేషన్ 2022 జూలై చివరి నాటికి లేదా ఆగస్ట్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.