భక్తులకు గుడ్ న్యూస్..ఇక గంటన్నరలోపే స్వామి వారి దర్శనం

0
111

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు. కానీ ఇప్పటి నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.

భక్తులు గంటల కొద్దీ నిరీక్షించకుండా వెంకన్న దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఈఓ ఏవీ ధర్మారెడ్డి గురువారం మీడియాతో చెప్పారు. గంటన్నరలోపే భక్తులకు సర్వదర్శనం చేయించేలా చర్యలు తీసుకోవడంతో పాటు..ఆన్‌లైన్‌ ద్వారా దర్శనంతో పాటు వివిధ సేవల టికెట్లు బుక్ చేసుకునే వాసులుబాటు కూడా కల్పిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర పనులకు ఉపయోగించకుండా బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు ఈ మేరకు తెలియజేసారు.