తెలంగాణాలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నియామక మండలి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇంటర్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడంతో పాటు..హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే 25 ఏళ్ళు మించకూడదు. అంతేకాకుండా గరిష్ట వయోపరిమితి ఐదేళ్లు సడలింపు చేసి చక్కని అవకాశం కల్పిస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 26 రాత్రి పదిగంటల వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.