నిరుద్యోగులకు గుడ్ న్యూస్..పదో తరగతితో ప్రభుత్వ ఉద్యోగం..అప్లై చేయండిలా..

Good news for the unemployed..government job with tenth class..should apply ..

0
84

నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్‌ల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. రైల్వేలోని అనేక వర్క్‌షాప్‌లు/యూనిట్‌లలో రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2,422 కాగా అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrccr.com/TradeApp/Loginని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటుంది. జనవరి 17, 2022 నుంచి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులందరూ ఫిబ్రవరి 16, 2022లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇదే చివరి తేదీ. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్.. అప్రెంటీస్ చట్టం,1961 ప్రకారం వీటిని భర్తీ చేస్తున్నారు.

పోస్టుల సంఖ్య..

1. ముంబై క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య – 1659

2. భుసావల్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య – 418

3. పూణే క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య – 152

4. నాగ్‌పూర్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య – 114

5. షోలాపూర్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య – 79

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వ్యక్తులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. కనీసం 50% మార్కులతో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థి ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు 15 సంవత్సరాల కంటే ఎక్కువ 24 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్థులందరూ దరఖాస్తు రుసుము రూ. 100 డిపాజిట్ చేయాలి.

ఎలా అప్లై చేయాలి..?

1. అధికారిక వెబ్‌సైట్ rrccr.com/TradeApp/Loginని సందర్శించండి.

2. అడిగిన సమాచారం అందించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి.

3. మీ ID పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

4. ఫారమ్‌ నింపి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

5. దరఖాస్తు రుసుమును చెల్లించి, ఓకె బటన్‌పై క్లిక్ చేయండి.

6. తదుపరి అవసరం కోసం దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

7. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.