తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టీఎస్ పంచాయతీరాజ్ శాఖ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 18 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అక్టోబర్ 10 దరఖాస్తులకు చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను http://www.tsprrecruitment.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.