నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు

Good news for the unemployed .. Jobs in AP Industries

0
110

ఏపీ: నిరుద్యోగులకు శుభవార్త. విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మినిస్టీరియల్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్ విభాగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో ఆయా విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నాయి. మరి వీటి దరఖాస్తు విధానం ఇప్పుడు తెలుసుకుందాం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

మొత్తం 23 ఖాళీలు

జూనియర్‌ అసిస్టెంట్‌ (08)

రికార్డ్‌ అసిస్టెంట్‌ (01)

ఆఫీస్‌ సబార్డినేట్‌ (12)

వాచ్‌మెన్‌ (01)

స్వీపర్‌ (01)

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ది డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌, మొదటి అంతస్తు, గవర్నమెంట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ బిల్డింగ్స్‌, ముత్యాలంపాడు, విజయవాడ, 520011 అడ్రస్‌కు అందించాలి.

ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 12,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు 20-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

అర్హతలు

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీతో పాటు కంప్యూటర్‌లో పరిజ్ఞానం ఉండాలి.

అభ్యర్థుల వయసు 01-10-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.