నిరుద్యోగులకు గుడ్ న్యూస్- మెట్రోలో ఉద్యోగాలు..నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం

0
103

నిరుద్యోగులకు శుభవార్త. చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఖాళీలు: 19 

అండర్‌గ్రౌండ్‌ కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్,సేఫ్టీ, డిజైన్‌ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

వీటిలో జనరల్‌ మేనేజర్‌ (01)

అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ (02)

జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ (02)

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (01)

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (01)

మేనేజర్‌ (04)

డిప్యూటీ మేనేజర్‌ (04)

అసిస్టెంట్‌ మేనేజర్‌ (04)

అర్హత:

పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

అభ్యర్థుల వయసు 2022 ఫిబ్రవరి 25 నాటికి 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 2,25,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులను జాయింట్ జనరల్‌ మేనేజర్ (హెచ్‌ఆర్‌), చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌, సీఎమ్‌ఆర్‌ఎల్‌ డిపో, అడ్మిన్‌ బిల్డింగ్‌, కొయంబత్తూరు, చెన్నై, 600107 అడ్రస్‌కు పంపించాలి.

అభ్యర్థులను మొదట పని అనుభవం, అకడమిక్‌ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.