నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

0
97

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (IRMA) సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణాభివృద్ధి నిర్వహణలో భాగంగా..ఆఫీస్ అసిస్టెంట్స్, రీసెర్చ్, కన్సల్టెన్స్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది.

ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు..

పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి. దీనితో పాటు.. ప్రాథమిక ఇంగ్లీష్ అండ్ హిందీ చదవే సామర్థ్యం ఉండాలి. విద్యా సంస్థలో ఇదే హోదాలో రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు..

ఆర్థిక శాస్త్రంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. సామాజిక శాస్త్ర రంగంలో పని అనుభవం ఉండాలి. ప్రాథమిక ఎకనామెట్రిక్ నైపుణ్యాలతో పాటు.. గణాంక సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలలో అనుభవం ఉండాలి. ఇంగ్లీష్ లో మౌఖిక అండ్ రాత పరీక్షలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ 22జూలై, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

వయస్సు:

ఆఫీస్ అసిస్టెంట్, రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

అసిస్టెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంపిక చేయనున్నారు.

జీతం:

ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.10 వేల నుంచి రూ. 12 వేల మధ్య జీతం చెల్లించనున్నారు.

రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు రూ.37 వేలు జీతం చెల్లించనున్నారు.

2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు 6 నెలలు ప్రొబిషన్ పిరియడ్ లో చేయాల్సి ఉంటుంది.