నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

0
107

నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించి మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1050 పోస్టులను భర్థీ చేయనుంది. మొత్తం 1050 మేనేజ్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యనికేషన్ సిస్టం అండ్ EDP విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

సంబంధిత విభాగాల్లో గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు..ఆసక్తి కలిగిన విద్యార్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు.

మొత్తం:1050

మైనింగ్: 699

సివిల్: 160

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్:124

సిస్టం అండ్ ఈడీపీ: 67

మైనింగ్: ఈ విభాగంలోని ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మైనింగ్ లో బీఈ/బీటెక్/బీఎస్సీ చేసి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులు పొంది ఉండాలి.

సివిల్: సివిల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్: ఈ విభాగంలో బీటెక్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.

సిస్టం అండ్ ఈడీపీ: కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసిన వారు లేదా ఎంసీఏ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు పొంది ఉండాలి…

వయస్సు: అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి.

జీతం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ.1.60 లక్షల వరకు వేతనం ఉంటుంది.

అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు..www.coalindia.in..ఈ వెబ్ సైట్ ద్వారా పూర్తీ వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు..