నిరుద్యోగులకు శుభవార్త..ఆ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

0
94

ఏపీ నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఏకంగా 560 గ్రేడ్ 2 అంగన్ వాడి సూపర్వైజర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..గ్రేడ్ 2 అంగన్ వాడి సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ రానుంది. అలాగే పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 40 సంవత్సరాల నుంచి 50 వరకు పెంచినట్లు కూడా ప్రకటన చేశారు. ఆషా కార్యకర్తలు, అంగన్ వాడి హెల్పర్ లకు జీతాల విషయంలో దేశంలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. అంగన్వాడీ వర్కర్లకు చెల్లిస్తున్న జీవితాల్లో దేశంలోనే టాప్ 5 రాష్ట్రాలలో ఇది ఒకటని తెలిపారు.

బాల బాలికలకు, గర్బవతులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం, అంగన్ వాడి కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఆంగన్‌వాడీ కేంద్రం సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా కలిపి జీతంగా ఇస్తాయి. దేశ వ్యావ్తంగా 22 లక్షలమంది ఆంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు ఉన్నారని అంచనా. అంగన్వాడీ కార్మికుల ప్రాథమిక ఉద్యోగం చాలా ముఖ్యం, సాధ్యం అత్యంత సమర్థవంతమైన రీతిలో నిర్వహించడం అవసరం. వారు నవజాత శిశువులు కోసం సంరక్షణ అందించడానికి, 6 సంవత్సరాల లోపు వయసు అన్ని పిల్లలు రోగ నిరోధకాలు అని నిర్ధారించడానికి అవసరం. వారు గర్భిణీ స్త్రీలు కోసం, వారు ధనుర్వాతం వ్యతిరేకంగా రోగ నిరోధకాలు అని భరోసా గర్భ సంరక్షణ అందించడానికి భావిస్తున్నారు.