నిరుద్యోగులకు శుభవార్త..టెన్త్ అర్హతతో రైల్వేలో జాబ్స్

0
115

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టెన్త్ అర్హతతో రైల్వే ఉద్యోగాల భర్తీ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 5636 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nfr.indianrailways.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

నోటిఫికేషన్ విడుదల: మే 30, 22.

అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం: జూన్ 1 ఉదయం 11 గంటల నుంచి..

దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ: జూన్ 30, రాత్రి 10 గంటల వరకు..

విద్యార్హతల వివరాలు:

అభ్యర్థులు టెన్త్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి.

అభ్యర్థులు ఐటీఐ సర్టిఫికేట్ ను కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్లు ఉండాలి..