ఐబీపీఎస్ పరీక్ష రాసే అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈ పరీక్ష రాసే అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయ్యి మంది అభ్యర్థులకు 45 రోజుల పాటు ఈ ఆన్‌లైన్ కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థులను కోరారు.
ఎంపిక ఇలా..
జిల్లాకు 30 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఆన్‌లైన్ తరగతులు జూలై 1 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. అభ్యర్థులు tsbcstudycircle.cgg.gov.in నుంచి దరఖాస్తు చేయాలని కోరారు. అభ్యర్థులకు పది, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో 60 శాతం మార్కులు తప్పనిసరని, తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. వివరాలకు 040-24071178, 27077929 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.