టెన్త్ పూర్తి చేసిన వారికీ గుడ్ న్యూస్..రైల్వేలో ఉద్యోగాలు

0
101

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే రాయ్‌పూర్‌ డివిజన్‌లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 1,033

పోస్టుల వివరాలు: వెల్డర్‌, టర్నర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, స్టెనోగ్రాఫర్‌, హెల్త్‌ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, మెషినిస్ట్‌, మెకానికల్‌ డీజిల్‌, మెకానికల్‌ ఆటో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు

అర్హులు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేసి ఉండాలి.

వయస్సు: జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: 10వ తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: మే 24, 2022