కార్ లోన్ తీసుకోవాలని అనుకునేవారికి గుడ్ న్యూస్..

0
99

చాలా మంది ఇల్లు కొనడానికి, కారు కొనడానికి లోన్ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నెమ్మదిగా లోన్ క్లియర్ చేసుకుంటారు. కానీ లోన్ పొందటానికి చాలా శ్రమించాల్సి ఉంటుందని చాలామంది తమ కలలను చంపుకుంటూ ఎమి కొనుక్కోరు. అలా అనుకునే వారికీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

అతిపెద్ద ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ ఎక్స్‌ప్రెస్ కారు లోన్స్ ని స్టార్ట్ చేసి కేవలం 30నిమిషాలలోనే కార్ లోన్ డెలివరీని అందిస్తూ ప్రజలను ఆనందపరుస్తుంది. సురక్షితమైన వెహికిల్ ఫైనాన్సింగ్ పొందాలంటే 48 గంటల నుంచి 72 గంటల వరకు పడతుంది. కానీ ఇంత త్వరగా లోన్ యివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు కారు లోన్లను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లోన్స్ అన్నీ కూడా డిజిటల్ ఇంటర్‌ఫేస్ ద్వారానే జరుగుతుంది. త్వరలో  టూవీలర్ లోన్లను కూడా జారీ చేయాలనీ యోచిస్తుంది.