సరిగ్గా ట్రైన్ బయలుదేరే ముందు కొందరు ప్రయాణికులు స్టేషన్ కి వస్తారు. ఈ సమయంలో చాలా మంది అరే బండి స్టార్ట్ అయింది అని కంగారు పడతారు. టికెట్ కూడా తీసుకునే సమయం ఉండదు. ఒక్కోసారి ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. ఇలాంటి ఇబ్బందులకు పరిష్కారం చూపుతూ, వారి సౌకర్యార్థం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ముందు మీరు రైలు ఎక్కడానికి కేవలం ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకుంటే చాలు, ఆ తర్వాత ఆ టికెట్ ను టీటీఈకి చూపించి ప్రయాణికులు వెళ్లాల్సిన స్టేషన్ వరకు టికెట్ తీసుకోవచ్చని రైల్వే శాఖ తెలియచేసింది.ప్లాట్ ఫామ్ టికెట్ ను యూటీసీ యాప్ ద్వారా లేక రైల్వే స్టేషన్లలోని వెండింగ్ మిషన్ల ద్వారా తీసుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం చాలా బాగుందని అంటున్నారు ప్రయాణికులు. ఇలా టీటీఈకి చూపించి మీరు వెళ్లే ప్రాంతానికి టికెట్ ని తీసుకోవచ్చు రిసిప్ట్ టికెట్ రూపంలో ఇస్తారు.