నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు ఇవే..
ఇందులో 21 సైంటిస్ట్ ‘బీ’, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పోస్టును బట్టి పదో తరగతి, రెండేళ్ల ఐటీఐ (ఎలక్ట్రికల్/ఫిట్టర్ ట్రేడ్) కోర్సు, ఫిజికల్ సైన్సెస్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/మెటీరియల్స్ సైన్స్/అనలిటికల్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ లేదా బీఎస్సీ, బీఈ/బీటెక్, బ్యాచిలర్స్ డిగ్రీలో ఇంజనీరింగ్/టెక్నీలజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తుదారుల వయసు 28 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.