నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..నాంపల్లిలో భారీ జాబ్ మేళా..ఎప్పుడంటే?

0
101

నిరుద్యోగులకు అలెర్ట్. సెప్టెంబర్ 17న నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాను డెక్కన్ బ్లాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.

ఈ మేళాను వివిధ కార్పొరేట్ సంస్థల మద్దతుతో NGO నిర్వహిస్తుంది. ఐటీ, విద్యా సంస్థలు, సెక్యూరిటీ, ఫార్మా తదితర వివిధ రంగాలకు చెందిన దాదాపు 70 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

అభ్యర్థులకు ప్రాథమిక విద్యార్హత పదోతరగతి ఉత్తీర్ణత. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య జాబ్ మేళా జరుగుతుందని, మరిన్ని వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.