నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..నెలకు రూ.72,000 వేతనంతో ఉద్యోగాలు

0
134

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్..తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ కింద ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో ఏఆర్టి, ఐసిటిసి, పీపీటిసిటీ సెంటర్లలో మొత్తం 33 ఖాళీలున్నాయి.

అర్హత ఏంటంటే..?

పోస్టును బట్టి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ (నర్సింగ్‌), జీఎన్‌ఎం, డీఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్‌టీ, ఎండీ, డీఎన్‌బీ, ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉండాలి.

ముఖ్యమైన తేదీలు..

అలాగే దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 10, 2022వ తేదీ నాటికి 30 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు సెప్టెంబర్‌ 20, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది.

జీతం..
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.21,000ల నుంచి రూ.72,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.