యువతకు శుభవార్త..భారీ నోటిఫికేషన్‌ రిలీజ్.. పూర్తి వివరాలివే

0
80

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పీవో పోస్టుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175. ఇతరులు రూ.850 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 22 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది. రెండు దశల రాతపరీక్షలు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలివే..

కెనరా బ్యాంక్: 2500

యూకో బ్యాంక్: 550

బ్యాంక్ ఆఫ్ ఇండియా: 535

పంజాబ్ నేషనల్ బ్యాంక్: 500

పంజాబ్ సింధ్ బ్యాంక్: 253

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2094

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 2, 2022

రిజిస్ట్రేషన్లకు ఆఖరు తేది తేదీ: ఆగస్టు 22, 2022

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెట‌ర్‌ డౌన్‌లోడ్‌ : సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: సెప్టెంబ‌ర్‌/అక్టోబరు 2022

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌: అక్టోబ‌ర్‌ 2022

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష : అక్టోబ‌రు 2022

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష ఫ‌లితాలు: న‌వంబ‌రు 2022

మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : న‌వంబ‌రు 2022

మెయిన్ ఎగ్జామ్: న‌వంబ‌రు 2022

మెయిన్ ఎగ్జామ్ ఫ‌లితాలు: డిసెంబ‌రు 2022

ఇంట‌ర్వ్యూ కాల్‌లెట‌ర్ డౌన్‌లోడ్‌ : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023

ఇంట‌ర్వ్యూలు : జ‌న‌వ‌రి/ఫిబ్రవరి 2023

తుది నియామకాలు: ఏప్రిల్ 2023

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి, ఇతర వివరాల కోసం IBPS వెబ్ సైట్ ను చూడొచ్చు.