యువతకు శుభవార్త..ఇండియన్ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హెడ్‌క్వార్టర్స్ అయిన అండమాన్ నికోబార్ కమాండ్‌లోని పలు యూనిట్లలో ఉన్న గ్రూప్-సి నాన్ గెజిటెడ్‌గా ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఖాళీలు, దరఖాస్తు విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీలు
నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 112 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హత:
పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కార్పెంటర్, కంప్యూటర్ హార్డ్వేర్నెట్వర్క్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, ఇండస్ట్రీయల్ పెయింటర్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను మొదట దరఖాస్తుల స్క్రీనింగ్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు 06-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.