గుడ్ న్యూస్..వారికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్

0
113

తాజాగా రేషన్ కార్డు దారులకు సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారనే ఉద్దేశ్యంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు  ఉన్నవారికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం కల్పిస్తుంది సర్కార్. ప్రభుత్వ పథకం ప్రకారం, అంత్యోదయ కార్డు హోల్డర్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయి.

గ్యాస్ సిలిండర్లను పొందాలంటే?

  • లబ్ధిదారుడు ఉత్తరాఖండ్‌లో శాశ్వత నివాసి అయి ఉండటం తప్పనిసరి.
  • వ్యక్తి తప్పనిసరిగా అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి
  • అంత్యోదయ రేషన్ కార్డ్ హోల్డర్ దానిని గ్యాస్ కనెక్షన్ కార్డుతో లింక్ చేయాలి.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని మీరు పొందాలనుకుంటే ఈ నెలలో అంటే జూలైలోనే మీ అంత్యోదయ కార్డ్‌ని LPG కనెక్షన్ కార్డ్‌తో లింక్ చేయండి. మీరు ఈ రెండింటిని అనుసంధానించకుంటే మీరు ఈ ప్రభుత్వ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కోల్పోతారు.