గుడ్ న్యూస్..నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు

0
99

యువతకు గుడ్ న్యూస్. భారత అంతరిక్ష పరిశోధన విభాగానికి చెందిన ఏపీలోని చిత్తూరు జిల్లా గాదంకిలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ ఒప్పంద ప్రాతిపదికన 16 జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/స్పేస్ ఫిజిక్స్/మెటియోరాలజీ/అప్లైడ్ కెమిస్ట్రీ/జియోఫిజిక్స్/ఎర్త్ సిస్టమ్ సైన్సెస్/ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ సైన్స్/స్పేస్ ఫిజిక్స్/మెటియోరాలజీ స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే యూజీసీ సీఎస్‌ఐఆర్‌ నెట్‌/గేట్‌/జామ్‌/జెస్ట్‌లలో ఏదైనా ఒక విభాగంలో వ్యాలిడ్‌ స్కోర్ సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 28 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 3, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.31,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.