గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాలకు రెండు సంవత్సరాల వయోపరిమితి పెంపు

0
106

తెలంగాణాలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. అయితే వీటికి సంబంధించి మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

పోలీసుశాఖ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కోరిక మేరకు తీసుకున్నట్టు తెలిపారు. రెండేండ్ల కరోనా కారణంగా యువతీ యువకులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.