నిరుద్యోగులకు మంచి అవకాశం..బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు

Good opportunity for the unemployed .. Jobs in Bank of India

0
192

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. లఖ్‌నపూ జోనల్‌ కార్యాలయంగా ఉన్న ఈ బ్యాంకు పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 పోస్టులకు అభ్యర్థులను తీసుకోనున్నారు. ఏయో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అర్హతలు ఏంటన్న వివరాలపై ఓ లుక్కేద్దాం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

నోటిఫికేషన్‌లో భాగంగా ఫ్యాకల్టీ, ఆఫీస్‌ అసిస్టెంట్‌, వాచ్‌మెన్‌, కౌన్సెలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌ ఆధారంగా 8వ తరగతి, మెట్రిక్యూలేషన్‌, డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా తప్పనిసరిగా ఉండాలి.

అభ్యర్థులు వయసు 18 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

*అభ్యర్థులు తమ దరఖాస్తులను జోనల్‌ కార్యాలయం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, లఖ్‌నపూ, స్టార్‌ హౌజ్‌, విభూతిఖండ్‌, గోమతినగర్‌, యపీ – 226010 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

అభ్యర్థులను పోస్టుల ఆధారంగా రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు 15-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.