గూగుల్ సంచలన నిర్ణయం- ఉద్యోగులకి గుడ్ న్యూస్ – కేవలం వారికి మాత్రమే

గూగుల్ సంచలన నిర్ణయం- ఉద్యోగులకి గుడ్ న్యూస్ - కేవలం వారికి మాత్రమే

0
95

ఈ కరోనా మహమ్మారితో చాలా మంది ఇంటి పట్టున ఉంటున్నారు, మరీ ముఖ్యంగా ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు,చాలా సాఫ్ట్వేర్ సంస్థలు తమ ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించాయి, ఇక కంపెనీలకు శని ఆదివారం వీక్ ఆఫ్ అనేది తెలిసిందే, చాలా ప్రముఖ ఎమ్ ఎన్ సీ కంపెనీలకు ఈ టైమ్ లో వారికి వీక్ ఆఫ్ ఉంటుంది.

అయితే గూగుల్ కూడా ఇదే అవకాశం ఉద్యోగులకి ఇచ్చేది, తాజాగా ఆరు నెలలుగా ఇంటిలోనే ఉండి ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగులు, వారు బయటకు వెళ్లలేక రెస్ట్ లేక ఇబ్బంది పడుతున్నారు.
శారీరక వ్యాయామం చేయలేకపోతున్నామని ఉద్యోగులు భావిస్తున్నారు. కొన్నిసార్లు తమ వ్యక్తిగత సమయంలోనూ కార్యాలయ పనిని చేయాల్సి వస్తోందని తెలియచేశారు.

దీంతో గూగుల్ తమ ఉద్యోగుల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది.వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు మరొక రోజును వీక్ ఆఫ్గా గూగుల్ ప్రకటించింది.శుక్రవారం రోజును సంస్థలోని శాశ్వత, తాత్కాలిక సిబ్బందికి వీక్ఆఫ్గా ప్రకటించింది. ఒకవేళ టెక్నికల్ గా ఆరోజు ఏదైనా అవసరం ఉండి వర్క్ చేస్తే ఆ రోజు వీక్ ఆఫ్ వారంలో ఏదో ఓ రోజు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు, మేనేజర్లు టీమ్ లీడర్లు వారికి మద్దతుగా ఉండాలి అని కంపెనీ తెలిపింది.